- Advertisement -
కీవ్: రష్యా సైన్యాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి ప్రవేశించడంతో అప్రమత్తమైన ఉక్రెయిన్ భద్రతా దళాలు దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీని బంకర్‌లోకి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. తమ అధ్యక్షుడిని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ భద్రతా దళాలు ఆయనను తరలించినట్లు తెలుస్తోంది.
పుతిన్ ఆస్తుల స్తంభనకు ఇయు నిర్ణయం
ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి లవ్రోవ్ ఆస్తులను స్తంభింపజేయడానికి ఐరోపా సమాఖ్య శుక్రవారం అంగీకారం తెలిపింది. యూరప్ దేశాల్లో ఉన్న వీరిద్దరి ఆస్తులను స్తంభింపజేయాలని ఇయు నిర్ణయం తీసుకుంది.
- Advertisement -