Monday, December 23, 2024

మోడీజీ జి 20 సమావేశాలకు హాజరు కాలేక పోతున్నా: పుతిన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు తాను రాలేక పోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. సోమవారం పుతిన్, మోడీ ఫోన్‌లో సంభాషించారు. రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సదస్సుకు హాజరవుతారని పుతిన్ వివరించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇటీవల దక్షిణాఫ్రికా లోని జొహన్సెస్‌బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ సదస్సు గురించి కూడా చర్చలో ప్రస్తావించారు. రష్యా తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకొంటున్నట్టు ప్రధాని మోడీ వివరిస్తూ భారత్ అధ్యక్షతన జరుగుతున్న జి 20 సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు స్థిరమైన మద్దతు రష్యా నుంచి లభిస్తుండడంపై పుతిన్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News