- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి.. ముచ్చింతల్‌లోని రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని సమతామూర్తి కేందాన్ని సందర్శించారు. 120 కెజీల బంగారంతో రూపొందించిన రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళుతున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మి, సిఎస్ సోమేష్‌కుమార్, డిజిపి మహేందర్‌రెడ్డి, అధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.
- Advertisement -