రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి రైతులను
నట్టేట ముంచి సంబురాలా? కాంగ్రెస్ నాయకులు
గ్రామాలకు వస్తే నిలదీయండి కాంగ్రెస్ ఎన్నికల
హామీలపై బహిరంగ చర్చకు సిద్ధం: హరీశ్‌రావు
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం దాడుల సం స్కృతి మార్చుకోకపోతే రాష్ట్రపతి పాలన పెట్టి శాంతిభద్రతలను కా పాడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అ న్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎంఎల్‌ఎ క్యాంపు కా ర్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అ ధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను నట్టేట ముంచి సిగ్గులేకుండా రైతు సంబరాలు చేయాల ని రేవంత్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేట న్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రా మాలకు వస్తే రైతులకు ఇచ్చిన హా మీలు ఏమయ్యాయని రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. రేవం త్‌రెడ్డి నుంచి రాహుల్ వరకు కాం గ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా ఒకవేళ నెరవేరిస్తే బహిరంగ చర్చకు తాను సిద్ధమని తెలిపారు.
ఎకరానికి 9 వేల రూపాయలను ఏటా రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు. మూడు పంటలకు రైతుబంధు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్క పంటకు కూడా సరిగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో కౌలు రైతుల గురించి పెద్దగా నోరు తెరిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నోరు మూసుకొని ఎందుకు ఉన్నారని పేర్కొన్నారు. కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే కేవలం పది లక్షల మందికి మా త్రమే అంటూ ఉపాధిలో 90 లక్షల మందికి ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. . రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి రెండు గుంటలో భూమి ఉన్న రైతులకు రైతు బీమా పథకం వర్తించదు అని చెప్పడం శోచనీయమన్నారు. ఎకరం లోపు భూమి ఉన్న పథకాలు వర్తించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఒక ఎకరం భూమి ఉన్న వారిని కూడా రైతుగా గుర్తించి భరోసా ఇవ్వాలన్నారు.
సంక్షేమంలో విఫలమైన రేవంత్ రెడ్డి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యాదాద్రిలో దాడులు చేస్తున్న వారిని పోలీసులే ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. కౌశిక్ రెడ్డి, అల్లు అర్జున్ ఇళ్ళమీద దాడులు, బిఆర్‌ఎస్, బిజెపి కార్యాలయాలపైన కాంగ్రెస్ దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారంటే ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందన్నారు. ప్రతిపక్ష నేతల అరెస్టు చుట్టే పోలీసుల్ని తిప్పితుండడంతో రాష్ట్రంలో క్రైం రేట్, మతకలహాలు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాడుల సంస్కృతి మారకుంటే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. కేంద్ర హోంశాఖ రాష్ట్రంపై రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంఎల్‌సి ఫారూఖ్ హుస్సేన్, బిఆర్‌ఎస్ నాయకులు గుండు భూపేష్, కొండం సంపత్ రెడ్డి, గ్యాదరి రవీందర్, మోహన్లాల్, కౌన్సిలర్లు తిరుమలరెడ్డి, సద్ది నాగరాజు రెడ్డి, అరవింద్ రెడ్డి, సాయి ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.