Sunday, November 3, 2024

వివాదాస్పదమవుతున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న నూతన పార్లమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనుండటం తీవ్రస్థాయి రాజకీయవివాదానికి దారితీస్తోంది. పార్లమెంట్ రాజ్యాంగ ప్రతిక. రాజ్యాంగానికి దేశ రాష్ట్రపతి కేంద్ర బిందువు.ఈ కోణంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ పార్లమెంట్ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయాల్సి ఉంటుందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ముందు ఈ అంశాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. తరువాత క్రమేపీఇతర పార్టీల నేతలు కూడా ఈ వాదనకు దిగుతున్నాయి. అత్యున్నత స్థాయి రాజ్యాంగ అధినేత దీనిని ప్రారంభించాలి తప్పితే ప్రధాని కాదని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.

ఈ క్రమంలో ఇప్పుడు పార్లమెంట్ భవన ప్రారంభానికి ప్రతిపక్షాల నేతలు హాజరవుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం బిజెపి, సంఘ్‌పరివార్ భావజాలానికి ప్రతీక అయిన సావర్కర్ జయంతి కూడా కావడం, ఈ తేదీని కావాలనే మోడీ, అమిత్ షాలు ఎంచుకుని ఖరారు చేశారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ రోజునే ఎంచుకోవడం రాజ్యాంగంలోని కీలకమైన లౌకికతకు విరుద్ధం అని పేర్కొంటున్నాయి. అసలు సిసలు రాజ్యాంగ నిర్మాతలు, జాతినేతలు ఎందరినో విస్మరించి ఈ తేదీని ఎందుకు ఎంచుకున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా ఇప్పటికీ రాష్ట్రపతికి ఆహ్వానం పంపించలేదని విమర్శించాయి. దీనికి ప్రతిగా బిజెపి ఎదురుదాడికి దిగింది. రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతల అల్పబుద్థికి ఈ చేష్టలు తార్కాణం అని, వీరు సావర్కర్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపిన బిజెపి ప్రతినిధి గౌరవ్ భటియా విమర్శలకు దిగే వారు సావర్కర్ కాలి గోటికి కాదు కదా, దుమ్ముకు కూడా సరిపోరని వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతికి అందని ఆహ్వానం: ఖర్గే
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రప తి ద్రౌపది ము ర్ముకు, అంతకన్నాముందు రాష్ట్రపతిగా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌లకు ఆహ్వానాలు అందలేదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవ పరుస్తోందని, రాష్ట్రపతి కార్యాలయాన్ని లాంఛన ప్రాయం చేసిందని ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ దేశ అత్యున్నత శాసన వ్యవస్థని, రాష్ట్రపతి ప్రభుత్వంతోపాటు , దేశ పౌరులందరి ప్రతినిధి అని ఖర్గే ట్వీట్ చేశారు.
గిరిజనులకు అవమానం: ఆప్
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభానికి రాష్ట్రపతి ము ర్ముకు బదులు ప్ర ధాని మోడీని ఆ హ్వానించడం రాష్ట్రపతి ముర్ముకు, గిరిజన, వెనుకబడిన తరగతుల సమాజానికి తీరని అవమానమని ఆ మ్ ఆద్మీపార్టీ (ఆప్ ) సోమవారం ధ్వజమెత్తింది. ఈ వైఖరి అధికార బీజేపీ గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల వ్యతిరేక ఆలోచ నా ధోరణిని ప్రతిబింబిస్తోందని పాత్రికేయ సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆప్ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News