Monday, January 27, 2025

17 మంది బాలలకు ప్రధాన మంత్రి, రాష్ట్రీయ పురస్కారాల ప్రదానం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం (డిసెంబర్ 26) 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 మంది బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కళ,సంస్కృతి, శౌర్యం, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు, పర్యావరణం తదితర ఏడు విభాగాలలో అసాధారణ విజయాలు సాధించిన బాలలకు ఈ అవార్డు వర్తిస్తుంది. ఈ అవార్డు గ్రహీతల్లో ఏడుగురు బాలురు కాగా, పదిమంది బాలికలు ఉన్నారు. వీరి ప్రతిభకు గుర్తింపుగా పతకం, సర్టిఫికెట్ , సైటేషన్ బుక్‌లెట్ ప్రదానం చేస్తారు. వీర్‌బాల్ దివాస్, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నామని , భారత యువకుల విజయాలు, సామర్థాన్ని అంతటా తెలిసేలా చేస్తామని కేంద్ర మహిళా , శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News