Monday, December 23, 2024

రాజ్‌ఘాట్‌లో 12 అడుగుల గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజ్‌ఘాట్‌లోని గాంధీ వాటికలో 12 అడుగుల ఎతైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ నెల 4న ఆవిష్కరిస్తారు. గాంధీ స్మృతి, దర్శన్ సమితి ఉపాధ్యక్షులు విజయ్ గోయల్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. దేశ 75 సంవత్సరాల స్వాతంత్య్రం, జి 20కి సారధ్యం నేపథ్యంలో జాతిపిత విగ్రహావిష్కరణకు నిర్ణయించినట్లు వివరించారు. 45 ఎకరాల గాంధీ దర్శన్ కాంప్లెక్స్‌లో ఈ విగ్రహం నెలకొంది. ఇక్కడ సందర్శకుల కోసం ఓ సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. గాంధీ జీవితంలో వివిధ ఘట్టాలను తెలిపే పలు స్థాయిల గాంధీ విగ్రహాలు కూడా ఉంటాయని గోయల్ తెలిపారు. గాంధీ దర్శన్‌లో జి 20 సభ్య దేశాల జాతీయ జెండాలను కూడా ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News