- Advertisement -
యాదాద్రి భువనగిరి: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ యాదాద్రికి చేరుకున్నారు. రాష్ట్రపతికి మంత్రులు జగదీష్ రెడ్డి,
ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, విప్ సునీత, ఆలయ కార్యనిర్వాహక అధికారి గీత ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళి సై సౌదర రాజన్ యాదాద్రికి వచ్చారు. అర్చకులు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామి వారిని ద్రౌపది దర్శించుకున్నారు.
- Advertisement -