Monday, January 27, 2025

ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రిపబ్లిక్ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు, ప్రాధాని మోడీ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

కాగా, తొలిసారి త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ప్రదర్శించారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎర్రకోట వరకు రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 31 శకటాలను ప్రదర్శిస్తున్నారు. దాదాపు 5 వేల మంది కళాకారులతో ప్రదర్శనలు చేయనున్నారు. కనువిందు చేయనున్న వైమానికి విన్యాసాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News