Thursday, January 23, 2025

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

Presidential candidate yashwant sinha visit to hyderabad

హైదరాబాద్‌: శనివారం హైదరాబాద్‌కు రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు టిఆర్‌ఎస్ పార్టీ ఘన స్వాగతం పలకనుంది. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన స్వాగతం పలుకుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో యశ్వంత్ సిన్హా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పోటోలతో కూడిన భారీ ప్లెక్సీలను జెండాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సభా వేదికైన నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశం కానునున్నారు. దీంతో నెక్లెస్‌రోడ్ జలవిహార్ మార్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్య ంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News