Monday, December 23, 2024

నేడే రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్

- Advertisement -
- Advertisement -

బరిలో ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున
యశ్వంత్ సిన్హా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తిచేసిన
ఎన్నికల కమిషన్ 21న ఓట్ల లెక్కింపు

న్యూఢిల్లీ: నూతన రాష్ట్రపతి ఎన్నిక సోమవారం జరగనుంది. 15వ భారత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు దాదాపు 4,800 మంది ఎంపిలు, ఎంఎల్‌ఎలు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ జరుగుతున్నప్పటికీ ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది మేర్ముకు ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో ఆమె విజయం నల్లేరుపై నడకేననిపిస్తోంది. సోమవారం ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు భవనంతో పాటుగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో జరగనుంది. ఇందుకోసం బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. జులై 21న పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

బిజెడి, వైసిపి, బిఎస్‌పి, అన్నాడిఎంకె, టిడిపి( జెడి(ఎస్) శిరోమణి అకాలీదళ్, శివసేన, తాజాగా జెఎంఎం లాంటి పలు ప్రాంతీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో ద్రైపది ముర్ము ఓట్ల వాటా మొత్ంత ఓట్లలో మూడింట రెండు వంతులకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 10,86,431 ఓట్లలో ఎన్‌డిఎ అభ్యర్థి ముర్ముకు 6.67 లక్షలకు పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ముర్ము ఈ దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి కానున్నారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. అయితే రాజకీయ పార్టీలు తమ ఎంపిలు, ఎంఎల్‌ఎలకు విప్ జారీ చేయడానికి వీలు లేదు. జమ్మూ,కశ్మీర్‌లో అసెంబ్లీ లేని కారణంగా ఎంపి ఓటు విలువ గతంలో ఉన్న 708నుంచి 700కు తగ్గింది. కాగా ఎంఎల్‌ఎ ఓటు విలువ ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. అత్యధిక జనాభా కలిగిన యుపిలో ఎంఎల్‌ఎ ఓటు విలువ 208గా ఉండగా, ఈశాన్య రాష్ట్రాలు సిక్కింలో ఎంఎల్‌ఎ ఓటు విలువ7, నాగాలాండ్‌లో9, మిజోరాంలో 8గా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News