- Advertisement -
హైదరాబాద్: వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈ పోటీలో తాను తిరిగి మరోసారి ఉంటానని, ఇదే ఆలోచనతో ఉన్నానని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి పుతిన్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. వివిధ ప్రాంతాలలో ఇప్పుడు తలెత్తుతున్న పరిణామాలను తాను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా,
బ్రిటన్ ఇతర పశ్చిమ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా కూటమిగా మారి తీవ్రస్థాయిలో విమర్శలకు , ఆంక్షలకు దిగుతున్నాయి. ఈ స్థితిలో భారతదేశం పరోక్షంగా అయినా రష్యాకు మద్దతుగా నిలవడం , దీనిని విమర్శిస్తూ పశ్చిమ దేశాలు విమర్శలకు దిగడం జరుగుతోంది. రష్యా నుంచి భారత్‌కు ముడిచమురు తక్కువ ధరకు అందుతోంది. ఇందుకు ప్రతిగా భారతదేశం రష్యాపై ఎటువంటి విమర్శలకు దిగడం లేదనే ప్రచారం జోరందుకుంది.
- Advertisement -