Saturday, November 23, 2024

నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి… రాష్ట్రపతి రేసులో ఇద్దరే

- Advertisement -
- Advertisement -

Presidential Poll nomination withdrawal deadline is over

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం నాటికి ముగిసింది. 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాలు మాత్రమే ప్రస్తుతం రేసులో ఉన్నారు. దాఖలైన 115 నామినేషన్లలో 107 పత్రాలను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తిరస్కరించారు. నిబంధనలకు తగినట్టు అవి లేకపోవడంతో తిరస్కరించామని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థులు ముర్ము, సిన్హా ఇద్దరూ చెరో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని, వారి నామినేషన్లను ఇదివరకే అమోదించామని పీసీ మోదీ వెల్లడించారు. జులై 18న పార్లమెంట్ లోని 63 నంబరు గదిలో ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ సాగుతుందని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్ ఉంటుంది. జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News