Sunday, December 22, 2024

మహిళా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

- Advertisement -
- Advertisement -

ఇక చట్టంగా మారిన సీట్ల కోటా.. అమలెప్పుడు?

న్యూఢిల్లీ : చట్టసభల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తమ ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారని శుక్రవారం కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం కోటా ఖరారుకు ఈ బిల్లు తీసుకువచ్చారు. రాష్ట్రపతి ఆమోదంతో ఇప్పుడు మహిళా బిల్లు చట్టంగా అవతరించింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు సంబంధిత చట్టం రాజ్యాంగంలోని (106వ సవరణ) చట్టం అయింది.

ఈ చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభ్వుం నోటిఫికేషన్ ద్వారా అధికారిక గెజిట్‌లో దీనిని పొందుపర్చిన నాటి నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు పరిగణిస్తారని న్యాయశాఖ తెలిపింది. ముందుగా ఈ ఆమోదిత బిల్లుపై ఉప రాష్ట్రపతి తమ ఆమోదం తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం ఉనికిలోకి వచ్చినా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, జనగణన వంటి భారీ ప్రక్రియలు పూర్తి తరువాతనే ఈ చట్టం అమలులోకి వస్తుంది. ఈ లోక్‌సభ ఎన్నికలలో మహిళా కోటా అమలు కాబోదు. తరువాత ఏర్పడే ప్రభుత్వం చేపట్టే కీలక ప్ర క్రియల తరువాతనే అమలులోకి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News