జనం కోసం స్పందించాలి.. మన ఘనత నినదించాలి
రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం
వీడని కోవిడ్ పీడకలపై తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ : దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ పవిత్ర దేవాలయం అని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. ఆదివారం దేశ స్వాతంత్య్ర దినోత్సవం అందులోనూ 75వ సంవత్సరపు అమృతోత్సవపు ఆగమ నం నేపథ్యంలో శనివారం రాత్రి రాష్ట్రపతి జాతిని ఉద్ధేశిం చి ప్రసంగించారు. ప్రజల బాగోగులు, వారి సమస్యలు గురించి చర్చించేందుకు అత్యున్నత సముచిత వేదిక అవుతుందని, ఈ కోణంలోనే పార్లమెంట్ అనేది దేవాలయం గా భావించుకుని వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ మధ్యలోనే పెద్ద గా చర్చల ప్రక్రియలు లేకుండానే అర్థాంతరపు వాయిదాలతో ముగిసిపోవడం వంటి పరిణామాలను దృష్టిలో పెట్టు కుని రాష్ట్రపతి సందర్భోచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి తమ ప్రసంగంలోనే దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, దీనిని మనం సెకండ్ వేవ్‌గా పరిగణిస్తున్నామ ని, ఇప్పటికీ కోవిడ్‌తో అత్యధిక సంఖ్యలో జనం చనిపోవ డం బాధాకరం అన్నారు.
ఇప్పటికీ ఈ పీడకల నుంచి మనం వీడిపోలేదని, అయితే ప్రజలు ధైర్యంగా ఉండాలని, మాన సిక ఆందోళనకు గురి కావద్దని పిలుపు నిచ్చారు. పలు స్థాయిలో ఈ వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. జనం ఎవరికివారుగా తమ బాధ్యతవహిస్తూ ఉండటం సమిష్టిగా దీనిపై పోరుకు దారితీస్తుందన్నారు. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో రైతుల దీర్ఘకాలిక ఉద్యమా న్ని పరోక్షంగా ప్రధమ పౌరుడు ప్రస్తావించారు. దేశంలో ప్రవేశపెట్టిన వరుస క్రమపు వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు అన్నదాతలను మరింత పరిపుష్టం చేస్తాయ ని, వారి సాధికారతకు దారితీస్తాయని తెలిపారు. వారి పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కేలా చూసేందు కు మార్గం ఏర్పడిందన్నారు. ఈసారి పార్లమెంట్ సెషన్ ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అఫలప్రదం అయిం ది. పైగా గందరగోళపు సెషన్ అయింది.
ప్రభుత్వం ప్రతి పక్షాల మధ్య సయోధ్య లేని స్థితి ఏర్పడింది. మనం స్వాతం త్య్రాన్ని పలు త్యాగాల తరువాత కష్టపడి సాధించుకున్నామని, ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కానీ ఇది నిలుస్తుందా? అని పలువురు సందేహాలు పెదవివిరుపులకు దిగారని రాష్ట్రపతి గుర్తు చేశారు. అయితే ఈ దేశంలో ప్రజా స్వామ్యపు వేళ్లు బలోపేతంగా నాటుకుని ఉన్నాయని వారి కి తెలియదని, పురాతనకాలం నుంచే ప్రజాస్వామ్యం ఇక్క డ ప్రాణప్రదం అయిందన్నారు. ఇక ఆధునిక భారత్ కాలం లోనూ ఇతర పాశ్చాత దేశాలతో పోలిస్తే ప్రజాస్వామ్య పథంలో ముందుందన్నారు. వయోజనులందరికీ ఎటువంటి భేదభావన లేకుండా అన్ని హక్కులు కల్పించడం జరుగుతోందన్నారు. మన జాతినేతలు ప్రజల విశ్వాసాల కు పట్టం కట్టారు.
వారి విజ్ఞతను ఆదరించారని కొనియాడారు. భారత ప్రజలకోసం భారత ప్రముఖ నేతలు ముందు కు సాగారు. వారిపట్ల తమ బాధ్యతను గురుతరంగా నిర్వ ర్తించారని తెలిపారు.దీనితో మన ప్రజాస్వామ్యం పటిష్టం అయిందన్నారు. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నామని, ఈ దిశలో మనకు పార్లమెంట్ అత్యున్నత విలువల స్థలం, ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడి నుంచే ప్రజలకు అవసరమైన విషయాలపై చర్చించుకోవాలి. సవ్యమైన రీతి లో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సి ఉందన్నారు. అంతి మ పరమావధి కేవలం ప్రజా సంక్షేమమే కావాలని రాష్ట్రపతి పిలుపు నిచ్చారు. త్వరలోనే ప్రజా ప్రతినిధులు నూత న పార్లమెంట్ భవనంలో కర్తవ్య పాలనకు వెళ్లాల్సిన సమ యం వస్తోందని, ఇది సంతోషించాల్సిన విషయం అన్నా రు. ఇటీవలి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ గౌరవం నిలిపిన క్రీడాకారులను రాష్ట్రపతి కొనియాడారు. వారి అసమాన కృషితోనే దేశానికి గర్వకారణం అయ్యారని తెలిపారు.