Monday, December 23, 2024

ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది… ఢిల్లీకి బయలుదేరిన ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగించుకొని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హకీంపేట విమానాశ్రయంలో ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు ఆనవాయితీలో భాగంగా బొల్లారంలోని తన నివాసంలో రాష్ట్రపతి శుక్రవారం ఎట్ హోమ్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి గవర్నర్, సిఎంతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, మాజి మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లిని కూడా సందర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News