Thursday, January 23, 2025

బాల్యవివాహ ప్రయత్నం అడ్డగింత

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా అల్గునూర్ గ్రామ తమిళకాలనీలో బాల్య వివాయ ప్రయత్నాన్ని అధికారులు అ డ్డుకున్నారు. తమిళకాలనీకి చెందిన అబ్బాయికి, నిజామాబాద్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి చేసేందుకని పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది.

విషయం తెలుసుకున్న ఆర్‌ఐ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్, బాలల పరిరక్షణ అధికారులకు సమాచారం అందజేశారు. అబ్బాయి తల్లిదండ్రులు మురళి, పుష్ప.. అమ్మాయి తల్లిదండ్రులు శంకర్, చిత్రకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పెళ్లి చేయడం నేరమనీ, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీఓ శాంత, 1098ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సంపత్, సూపర్‌వైజర్ శ్రీలత తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News