Wednesday, January 22, 2025

పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ

- Advertisement -
- Advertisement -

ఇటీవల, పంజాబ్ రాష్ట్రంలో పత్తి విత్తిన కొన్ని ప్రాంతాలు గులాబీ రంగు కాయతొలుచు పురుగుల బారిన పడ్డాయి. ముందుగా విత్తిన పత్తి పంట 60, 80 రోజుల మధ్య వయస్సు ఉన్నందున, పత్తి సాగు చేసే రైతులు గులాబీ రంగు కాయతొలుచు పురుగు సమస్య ను సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి అందుబాటులో ఉన్న అన్ని నిర్వహణ వ్యూహాలను ఏకీకృతం చేయడం చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే ఈ గులాబీ రంగు కాయ తొలుచు పురుగు సమస్య ను అంతం చేయగలరు. “గులాబీ రంగు కాయతొలుచు పురుగు, కాయలోకి చొచ్చుకుపోతుంది. అందువల్ల బయటి నుండి దీనిని గుర్తించటం కష్టం. కావున రైతులు అప్రమత్తంగా ఉండడం, పూలు, పత్తి కాయ లను పరిశీలించడం ద్వారా గులాబీ రంగు కాయతొలుచు పురుగుల సంకేతాలను వెంటనే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం మంచిది” అని గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సీఈఓ రాజవేలు ఎన్.కె. అన్నారు.

ఆయన వెల్లడించే దాని ప్రకారం, ఈ ముప్పును ఎదుర్కోవడానికి స్వల్పకాలిక పత్తి రకాలను అవలంబించడం, ఈ పురుగుల అభివృద్ధి నిరోధించడానికి పంట మార్పిడి విధానం అనుసరించటం, పంట అవశేషాలను నాశనం చేయటం, నత్రజనితో కూడిన ఎరువులను మెరుగ్గా వినియోగించటం వంటివి చేయడం ద్వారా ముప్పు తప్పించుకోవచ్చు. పత్తి పంట మధ్యస్థ, చివరి దశల్లో గులాబీ రంగు కాయతొలుచు పురుగు పంటకు సోకుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల గులాబీ రంగు కాయతొలుచు పురుగును సమర్థవంతంగా నిరోధించడానికి వివిధ రకాల ప్రభావాలను కలిగి ఉండే పురుగుమందులను మార్చి మార్చి వాడటం లేదా కలిపి మిశ్రమంగా వాడటం చేయాలి.

ఉదాహరణకు, హెక్టారుకు 200 గ్రాముల ఎల్పిడా ను పుష్ప లేదా కాయ ఏర్పడే దశలో మొదటి పిచికారీ గా చేస్తే , హెక్టార్ కు 800 మి.లీ జార్, హెక్టార్ కు 1000 మి.లీను కాయ ఏర్పడటం, పరిపక్వ దశలో రైతులు కీటక నిరోధకత కోసం స్ప్రే చేయాలి. తద్వారా కీటకాలను నిరోధించటం తో పాటుగా వాటి అభివృద్ధిని ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది. “పొదుగుతున్న సమయంలో లేదా గరిష్ట అభివృద్ధి దశలో పురుగుమందులు ఉపయోగించడం సిఫార్సు చేయబడింది. అయితే, క్లిష్ట సమయంలో అప్రమత్తంగా ఉండటం, నిరోధక పత్తి రకాలను మొదటి నుండే విత్తడం వల్ల పత్తి కాయతొలుచు పురుగుల బెడదను నివారించవచ్చు” అని రాజవేలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News