Thursday, January 23, 2025

పూర్వజిల్లాల సర్వీసు పరిగణనలోకి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపాద్యాయుల బదిలీల్లో జిఒ 317తో బదిలీ అయిన టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. టీచర్ల బదిలీ ల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈనెల 12 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా జిఒ 317 ప్రకారం వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సూచనల మేరకు అవకాశమివ్వనున్నట్లు మంత్రి పి. సబిత ఇంద్రారెడ్డి వెల్లడించా రు. ఇప్పటికే ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులందరికీ సమన్యా యం చేకూర్చాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ ని ర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటికే వచ్చిన 59వేల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

హైకోర్టు ఉత్తర్వులతో టీచర్లకు ఊరట

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఎస్‌జిటిలు, స్కూ ల్ అసిస్టెంట్ల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. అ యితే, బదిలీలకు సంబంధించిన నిబంధనల్లో కనీసం ఒకేచోట రెండేళ్లు పనిచేసిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జిఒ 317 ప్రకారం ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు బదిలీ అయిన వారికి రెండేళ్ల సర్వీసు పూర్తి కాలేదు. దీంతో.. తాము ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చామని, ఉమ్మడి జిల్లాలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఉపాధ్యాయుల అభ్యర్ధనను పరిశీలించిన హైకోర్టు ఇలాంటి టీచర్లు దాదాపు 25 వేల మంది ఉన్నందున ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని సర్వీసు పాయింట్లను కూడా జత చేసి, వాటి ఆధారంగా బదిలీలకు సంబంధించి అనుమతివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులతో ఉపాధ్యాయులకు ఊరట లభించింది. హైకోర్టు ఉత్తర్వులపై ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుంచి బదిలీ అయిన 25 వేల మందిలో దాదాపు 15వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటున్నారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News