- Advertisement -
రూ.47 వేలకు చేరువలో పసిడి
న్యూఢిల్లీ : బంగారం ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.47,000 మార్క్‌కు చేరుకుంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.69,500కు చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 వద్ద ఉంది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలతో గత కొద్ది రోజులుగా బంగారం ధర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. వరుసగా రెండో రోజు పసిడి ధర తగ్గింది. ముంబైలో పది గ్రాములు రూ.467 పడిపోయి రూ.45,509 వద్ద ట్రేడవుతోంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.360 తగ్గి రూ.45,200 వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం కావడం వల్ల విలువైన లోహాల ధరలు దిగొచ్చాయని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
- Advertisement -