- Advertisement -
ఇంఫాల్ : మణిపూర్‌లో నిత్యావసరాల ధరలు రెట్టింపు అయ్యాయి. బ్లాక్ మార్కెట్‌లో లీటర్ పెట్రోల్ రూ.200 కు అమ్ముతున్నారు. ఎటిఎంలో డబ్బులు, అవసరమైన మందులు అందుబాటులో ఉండడం లేదు. కర్ఫూను కొన్ని గంటల పాటు సడలిస్తుండడంతో రోజూ షాపులను కొన్ని గంటలు మాత్రమే తెరుస్తున్నారు.
గతంలో కిలో బియ్యం ధర సగటున రూ. 30 ఉండగా, ఇప్పుడు రూ. 60 కు చేరింది. కూరగాయల ధరలు అందుబాటులో ఉండడం లేదు. ఉల్లిపాయలు కిలో రూ.35 నుంచి 70కు ,బంగాళా దుంపల ధర కిలో రూ.15 నుంచి రూ. 40 కు ,గుడ్డు ధర రూ.6 నుంచి రూ. 10కి పెరిగాయి. వంట నూనె ధరలు రూ. 220 నుంచి రూ. 250, రూ. 280 వరకు పెరిగాయి.
- Advertisement -