Tuesday, November 5, 2024

అయోధ్య ఆలయ ప్రధాన పూజారి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించిన ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ శనివారం ఉదయం కన్నుమూశారు. 86 సంవత్సరాల ఈక్షిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మణికర్ణిక ఘాట్‌లో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగింది. వారణాసిలోని ప్ప్రముఖ వేద పండితులలో ఒకరైన దీక్షిత్ పూర్వీకులు

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన వారైనప్పటికీ దీక్షిత్ కుటుంబం అనేక తరాలుగా వారణాసిలోనే నివసిస్తోంది. దీక్షిత్ మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సంతాపం ప్రకటించారు. కాశీకి చెందిన గొప్ప పండితులు, శ్రీరామజన్మభూమి ప్రాణ ప్రతిష్ట మహోత్సవ ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత మరణం ఆధ్యాత్మిక, సాహితీ ప్రపంచానికి తీరని లోటని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సంస్కృత భాషకు, భారతీయ సంస్కృతికి ఆయన అందచేసిన సేవలు చిరస్మరణీయమని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News