Monday, December 23, 2024

మహిళలను లొంగదీసుకుంటున్న పూజారీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః దేవాలయానికి పూజల పేరుతో వస్తున్న మహిళలను లొంగదీసుకుంటున్న పూజారిని జగద్గిరిగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆస్బెస్టస్ కాలనీలోని ఆంజనేయ స్వామి టెంపుల్‌లో వేల్పూరి రాము పూజారిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే దేవాలయానికి పూజలు చేయించుకునేందుకు వచ్చే మహిళలను వివిధ పేర్లు చెప్పి లొంగదీసుకుంటున్నాడు.

అంతేకాకుండా వారి ఆస్తులపై కన్నేసిన పూజారి వాటిని కొట్టేసేందుకు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.దీంతో ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పూజారిపై 417,354ఎ,354సి,506,376(2)(ఎన్),384 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ సైదులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News