Sunday, December 22, 2024

సినీ దర్శకుడికి చేదు అనుభవం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. హౌస్ ఫుల్ సిరీస్, హే బేబీ, హిమ్మత్ వాలా, హమ్‌షకల్ తదితర అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్ బిగ్ బాస్ 16లో కంటెస్టెంట్‌గా పాల్గొని అర్ధాంతరంగా బయటకు వచ్చేసిన తర్వాత మొదటిసారి సిద్ధార్థ మల్హోత్ర, రష్మిక మందన నటిస్తున్న మిషన్ మజ్ను చిత్రం ప్రీమియర్ షో ఇటీవల ముంబైలో జరిగిన సందర్భంగా హాజరయ్యారు. ఈ సీజన్ విన్నర్ ఎవరో చెప్పాలంటూ కొందరు ప్రేక్షకులు ఆయనను అభ్యర్థించగా కొందరు సాజిద్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు.

ఈ దశలోనే ఒక పూజారి కూడా సాజిద్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. అయితే అతను అంతటితో ఆగకుండా జై శ్రీరామ్ అని చెప్పాలంటూ సాజిద్‌ను పదేపదే కోరాడు. ఇందుకు సంబంబంధించిన వీడియో ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే సాజిద్ మాత్రం ఒక్క మాట అనకుండా అనక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. ఆ పూజారి వైఖరిని చాలామంది తప్పుపట్టారు. జై శ్రీరామ్ చెప్పాలంటూ ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని, ఇలాంటి అంధ భక్తుల వల్లే మన దేశం వెనుకబడి పోయిందంటూ ఒక నెటిజన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. తాను హిందువునని, కాని ఎవరినీ బలవంతంగా జైశ్రీరామ్ అని చెప్పించబోనని, ఎవరి మత విశ్వాసాలు వారివంటూ మరో నెటిజన్ స్పందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News