Monday, January 20, 2025

లౌడ్ స్పీకర్ తగ్గించమన్నందుకు పూజారిని చంపేశారు…

- Advertisement -
- Advertisement -

పాట్నా: శివాలయానికి సమీపంలో లౌడ్ స్పీకర్లు పెట్టడం వద్దని చెప్పినందుకు పూజారిని నలుగురు వ్యక్తులు కొట్టి చంపిన సంఘటన బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలోని భగవన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఆస్తూర్ సత్‌పూర గ్రామంలోని ఓ శివాలయంలో శివ నారాయణ్ అనే పూజారి పూజలు చేసేవారు. శ్రావణ మాసంతో పాటు సోమవారం కావడంతో భక్తులు ఎక్కువగా తరలిరావడంతో నారాయణ్ పూజలు చేస్తున్నారు. భక్తులు నీళ్లు, పాలు అందిస్తుండడంతో శివ లింగం పోస్తూ మంత్రాలు చదువుతున్నారు.

Also Read: ఎంత పని చేశావ్ టమాటా… కూర వండిన భర్త… భార్య కనిపించడం లేదు

అదే సమయంలో నలుగురు వ్యక్తులు లౌడ్ స్పీకర్‌తో పాటలు మోగించడంతో బంద్ చేయాలని పూజారి సూచించాడు. దీంతో నలుగురు వ్యక్తులకు, పూజారికి మధ్య గొడవ జరగడంతో నారాయణ పొట్ట, చాతీ భాగంతో పంచ్‌లు ఇవ్వడంతో అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News