Wednesday, January 22, 2025

దేవాలయంలో మహిళా డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించిన పూజారి…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఆలయ పూజారి మహిళా డ్యాన్సర్స్‌తో అసభ్యంగా ప్రవర్తించిడంతో పాటు అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను బూతులు తిట్టడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. ముక్టేశ్వర్ దేవాలయంలో శక్తికాంతా బాదు అనే పూజారి ఉన్నాడు. ఒడిశ డ్యాన్సర్లు ముక్టేశ్వర్ దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చారు. పూజారి శక్తికాంతా మహిళా డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులను కూడా బూతులు తిట్టడంతో పూజారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముక్టేశ్వర్ దేవాలయంలో పదో దశాబ్దానికి చెందినది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం డ్యాన్స్ ఫెస్టవల్ అంగరంగా వైభవంగా జరుగుతోంది. ఒడిశా టూరిజం డిపార్ట్ ప్రతి సంవత్సరం వైభవంగా ఈ పండుగను జరిపిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News