Sunday, December 22, 2024

తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తాం..

- Advertisement -
- Advertisement -

మనతలెంగాణ/వెంకటాపూర్‌: తెలంగాణ రాష్ట్ర సర్కారు గ్రామీణ వైద్యంపై చూపిస్తున్న ప్రేమను దృష్టిలో పెట్టుకోని సర్కారు చూపిన భాటలో నడుస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని తల్లీ బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దపెట్టి నిరంతరం వారి ఆరోగ్య సేవల్లో భాగస్వాములమవుతామని వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం వెంకటాపూర్ మండల కేంద్ర సమీపంలోని సూమారు 10 కీలో మీటర్ల దూరంలోని అటవి ప్రాంతంలో తొర్రిచింతలపాడులో నివసిస్తున్న 150 కుటుంబాల గొత్తికోయ ప్రజలకు వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కాలీనడకన చేరుకోని వారికి ప్రత్యేక వైధ్య శిభిరం ఏర్పాటు చేసి వారికి మందులు అందజేశారు. ఈసందర్భంగా 55 మంది వైద్య పరీక్షలు, 24 మందికి రక్త పరీక్షలు, నలుగురు చిన్నారులకు ఇమ్యూనైజేషన్, ఇద్దరు గర్భీనీ స్త్రీలకు పరీక్షలు చేసినట్లు ఆయన వివరించారు.

ఈసందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ములుగు డీఎంహెచ్ వొ అల్లం అపయ్య ఆదేశాల మేరకు మండల కేంద్ర సమీపంలోని గొత్తికోయ గూడాల్లో వైద్య సేవలు విస్తరించేలా సిబ్బందిని అప్రమత్తం చేసి ఉదయం 10 గంటలకు కాలీ నడకన 10 కీలో మీటర్లు నడిచి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శిశు మరణాలను తగ్గిస్తూ, ప్రతి గర్బీనీపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తమన్నారు. మండలంలోని 9 సబ్ సెంటర్లో పని చేస్తున్న ఎఎన్‌ఎంలు, మరియు ఆశాలతో ప్రత్యేక సమావేవాలు ఏర్పాటు చేసి నిరుపేదల కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. నిరుపేదలకు సేవ చేయడం మాకు ఓ వరమని ఆయన కోనియాడారు. ఏదైన చిన్న సమస్య వచ్చిన వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి రావాలని సూచించారు. అత్యవసరమైతే వైద్య సిబ్బంది మీ ఇంట్లొకి వచ్చి సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రిషిత, సీహెచ్‌వో సదానందం, పీహెచ్‌ఎన్ శోభ,ఎల్‌టీ కృష్ణ, ఎఎన్‌ఎంలు స్వప్న, కనకలక్ష్మీ, ఆశాలు సరోజన, మాధవి, సౌజన్య, శోభ, కవిత, సంపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News