Saturday, February 15, 2025

ఇక్కడ మౌనం… అక్కడ ‘వ్యక్తిగతం’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వాణిజ్యవేత్త గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ ‘కప్పిపుచ్చుతున్నారు’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. దేశంలో ప్రశ్నలు అడిగినప్పుడు ప్రధాని మౌనం పాటిస్తుంటారని, విదేశాల్లో అడిగితే దానిని వ్యక్తిగత వ్యవహారం అని అభివర్ణిస్తుంటారని రాహుల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. ‘దేశంలో మీరు ప్రశ్నలు అడిగితే మౌనమే సమాధానం అవుతుంది, అదే విదేశాల్లో మీరు అడిగితే అది వ్యక్తిగత వ్యవహారం అవుతుంది. తుదకు అమెరికాలో కూడా అదానీజీ అవినీతిని మోడీజీ కప్పిపుచ్చారు’ అని రాహుల్ ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో ఆరోపించారు.

చర్చల్లో అదానీ అంశం ప్రస్తావనకు వచ్చిందా అని వాషింగ్టన్‌లో సంయుక్త మీడియా గోష్ఠిలో ప్రశ్నించినప్పుడు ‘భారత్ ప్రజాస్వామ్య దేశం, మా సంస్కృతి ‘వసుధైక కుటుంబం’. మేము సమస్త ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణిస్తుంటాం. ప్రతి భారతీయుడు నా మనిషే అని భావిస్తుంటాను’ అని ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు. అటువంట వ్యక్తిగత వ్యవహారాలు ఇద్దరు అధినేతల మధ్య చర్చల్లో ప్రస్తావించరు’ అని ఆయన చెప్పారు. ‘రెండు దేశాల ప్రముఖ నేతలు ఇద్దరు అటువంటి వ్యక్తిగత అంశాలను చర్చించరు’ అని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News