- Advertisement -
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం “మేరా యువభారత్ ” “మై భారత్” పోర్టల్‌ను ప్రారంభించారు. 21వ శతాబ్దం జాతి పునర్నిర్మాణంలో ఈ వేదిక కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. మేరా మాటీ మోరా దేశ్ అమృత్ కలశ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా మేరా యువ భారత్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు.
ఢిల్లీ లోని కర్తవ్య పథ్‌లో మేరీ మాతీ మేరా దేశ్ అమృత కలశ్ యాత్ర ముగింపు యాత్రలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి సేకరించిన మట్టిని ప్రధాని మోడీ భారత్ కలశ్‌లో ఉంచారు. కలశ్ లోని మట్టిని ఆయన తన నుదుట తిలకంగా దిద్దుకున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన మట్టితో ఇండియా గేట్ సమీపాన అమృత్ మహోత్సవ్ స్మారక్ అమృత్ వాటిక నిర్మాణం కానుంది. రానున్న తరాలు ఈ ఈ స్మారక ఉద్యానవనం ద్వారా ఈ చారిత్రక సంఘటనను గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు.
- Advertisement -