Monday, December 23, 2024

పటేల్ వర్గం… సహకార సంఘం

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi and Amit Shah visit Gujarat

గుజరాత్ ఎన్నికలపై మోడీ , షా నజర్
ఒకేసారి ఇరువురు రెండురోజుల బస
బిజెపి బలానికి గండిపడకుండా జాగ్రత్తలు

గాంధీనగర్ : త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర కీలక మంత్రి అమిత్ షా గుజరాత్‌పై దృష్టి కేంద్రీకృతం చేశారు. శనివారం ఇరువురు గుజరాత్‌లో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాలలో , ప్రత్యేకించి ఎన్నికలలో ఓట్లకు వెన్నెముక వంటి పాటిదార్లు, సహకార సంఘాలు బిజెపి ప్రాబల్యంతోనే ఉండేలా చేసేందుకు పావులు కదిపారు. గుజరాత్‌లో అధికారానికి పాటిదార్లు, కోఆపరేటివ్స్ బలం అత్యంత కీలకం. ఈ ఏడాది చివరిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. గుజరాత్ కీలక రాజకీయ కేంద్రాలు, బలమైన వర్గాలను దృష్టిలో పెట్టుకునే ఇరువురు నేతలు ఈ వారాంతంలో రెండు రోజుల పాటు గుజరాత్‌లో మకాం వేసేందుకు పర్యటనలు ఖరారు చేసుకున్నారు. రాజ్‌కోట్ జిల్లాలోని అట్కోట్‌లో సూపర్‌స్పెషాల్టీ హాస్పిటల్‌ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. పాటిదార్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంపై వరాల జల్లును కురిపించే కార్యక్రమం ముమ్మరం చేశారు.

రాజ్‌కోట్ సౌరాష్ట్ర ప్రాంతపు ప్రధాన నగరం. ఇక్కడ బిజెపికి 2015లో తలెత్తిన పాటిదార్ల కోటా ఉద్యమం చుక్కలు చూపింది. ఎన్నికలలో కొంత బలం తగ్గింది. నిజానికి పాటిదార్లు రాష్ట్రంలో 1998 నుంచి బిజెపి అధికార స్థానంలో నిలిచేందుకు ఇది కొనసాగేందుకు పాటిదార్లే కీలక ఛోదక శక్తిగా మారారు. పాటిదార్ల ఆధ్వర్యపు శ్రీ పటేల్ సేవా సమాజ్ ట్రస్టు (ఎస్‌పిఎస్‌ఎస్‌టి) ఇక్కడి ఆసుపత్రిని రూ 50 కోట్లతో నిర్మించింది. దీనిని ప్రధాని మోడీ ప్రారంభించడం పాటిదార్ల ప్రసన్నతకు అనే రాజకీయ వర్గాలు స్పష్టం చేశాయి. 182 స్థానాల గుజరాత్ అసెంబ్లీలో పాటిదార్లకు సౌరాష్ట్ర ప్రాంతంలో 16 స్థానాలు ఉన్నాయి. గుజరాత్‌లో రాజకీయాధికారం పటేల్ వర్గం ప్రాబల్యంతోనే సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పటేల్ వర్గానికి చెందిన వారు రాష్ట్ర అసెంబ్లీలో 55 మంది వరకూ ఉన్నారు. రాజ్‌కోట్‌తో ప్రధాని మోడీ బంధం చిరకాలంగా ఉంది. 2002లో ఆయన రాజ్‌కోట్ 2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచే గెలిచారు.

తరువాతి క్రమంలో దేశంలోనే సుదీర్ఘ కాలపు పాలన సాగించిన సిఎంగా మోడీ నిలిచారు. నియోజకవర్గాలు మారాయి. తరువాత ప్రధాని స్థానానికి ఎగబాకారు. పాటిదార్ల కోటా ఉద్యమం ఓ దశలో బిజెపికి చిక్కులు తెచ్చిపెట్టింది. అయితే పటేల్ వర్గం నుంచి చివరికి రాజకీయ మద్దతు బిజెపికే దక్కింది. ఇక రాష్ట్రంలో అత్యంత కీలకమైన సహకార సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు మోడీ, అమిత్ షాలు సంకల్పించారు. ఈ క్రమంలో గాంధీనగర్‌లో శనివారం సాయంత్రం సహకార్ సమ్మేళన్‌కు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. సహకార సంఘాలకు ఉన్న సభ్యత్వాలు , వాటికి ఉండే ఆర్థిక వెన్నుదన్నుల క్రమంలో బిజెపి వీటిపైనే అత్యంత వ్యూహాత్మకంగా దృష్టి సారించింది. ఎన్నికలకు ముందు ఇరువురు అగ్రనేతల రాకతో ఇక గుజరాత్‌లో ఎన్నికల సందడి నెలకొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News