Saturday, November 23, 2024

ప్రధాని మోడీ వివక్షతామూర్తి

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi discriminates:KTR

వివక్షకు చిహ్నమైన వ్యక్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరించారు : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : వివక్షకు చిహ్నమైన వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారని మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణపై ట్విట్టర్ వేదికగా ఆదివారం నాడు ఆయన స్పందించారు.సమతామూర్తి కేంద్రం లో 120 అడుగుల రామానుజచార్య విగ్రహాన్ని ప్రధాని మోడీ శనివారం ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోడీకి కెసిఆర్ స్వాగతం పలకలేదు. జ్వరం వచ్చిన కారణంగా కెసిఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని టిఆర్‌ఎస్ ప్రకటించింది. అయితే ప్రధానికి స్వాగతం పలకకుండా కెసిఆర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బిజెపి విమర్శలు చేసింది. శనివారం నుండి సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ విషయమై ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా కెటిఆర్ స్పందిస్తూ.. సమతామూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనంగా మారిందన్నారు.

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. వివక్షకు చిహ్నమైన వ్యక్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరించారన్నారు. సమానత్వం దూరం చేసినవాళ్లు ఈ విగ్రహావిష్కరించడం చూసి వ్యంగ్యం కూడా కోటిసార్లు మరణించిందన్నారు. శనివారం నుండి బిజెపి, టిఆర్‌ఎస్ నేతల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. శనివారం నాడు ట్విట్టర్‌లో ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. శనివారం నాడు బిజెపి నేతలు సోషల్ మీడియాలో సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్‌లపై విమర్శలు చేయడంతో టిఆర్‌ఎస్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. మంత్రులు, టిఆర్‌ఎస్ నేతలు బిజెపిపై అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు.

కేంద్రం నుండి నిధుల మంజూరుతో పాటు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయమై విమర్శలు చేశారు. ప్రధాని స్వాగతం పలకడంపై ప్రోటోకాల్‌ను పట్టించుకోకపోవడమేమిటని బిజెపి నేతలు మండిపడుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రభుత్వ ప్రకటనను కూడా బిజెపి నేతలు గుర్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు, తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడాన్ని టిఆర్‌ఎస్ నేతలు, మంత్రులు కూడా ట్విట్టర్ వేదికగా ప్రస్తావిస్తున్నారు. కేంద్ర సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేయకుండా కేంద్రం వివక్షకు పాల్పడిందని కూడా తెలంగాణ మంత్రులు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News