న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో మొదటిసారి మూడు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీ 25 సమావేశాలలో పాల్గొని దాదాపు 65 గంటలు గడపనున్నట్లు ప్రభ్వుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో మే 2న మూడు రోజుల పర్యటన నిమిత్తం జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ వెళ్లనున్న ప్రధాని మోడీ ఏడు దేశాలకు చెందిన 8 మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాలతోపాటు 50 మంది ప్రపంచ వ్యాపార దిగ్గజాలతో చర్చలు జరుపుతారని శనివారం వర్గాలు తెలిపాయి. ఆయా దేశాలలో నివసిస్తున్న వేలాది మంది భారతీయ సంతతి ప్రజలను కూడా ఆయన కలుసుకుంటారని తెలిపారు. ప్రధాని మొదటగా జర్మనీ వెళతారు. తర్వాత డెన్మార్క్‌ను సందర్శిస్తారు. మే 4న తిరుగు ప్రయాణంలో కొద్దిసేపు పారిస్‌లో గడుపుతారు. జర్మనీలో ఒకరాత్రి, డెన్మార్క్‌లో ఒకరాత్రి, విమానంలో రెండు రాత్రులు గడుపుతారని వారు వివరంచారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగే ఇండో జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ ఆరవ సభలో ప్రధాని మోడీ పాల్గొటారు. పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌తో భేటీ అవుతారు.
మే 2 నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన
- Advertisement -
- Advertisement -
- Advertisement -