న్యూఢిల్లీ: కచ్చతీవు దీవులను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అప్పటి తమిళనాడు సిఎం కరుణానిధికి ఈ విషయం చెప్పి, కచ్చతీవు దీవులను శ్రీలంకకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ విషయం ఆర్టీఐ దరఖాస్తుతో తాజాగా బయటపడిందని చెప్పారు. ఇది తెలిసిన ప్రతీ భారతీయుడు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడని అన్నారు.
భారతదేశ ఐకమత్యాన్ని, సమగ్రతతను, ప్రయోజనాలను 75 ఏళ్లుగా కాంగ్రెస్ దూరం చేస్తూనే ఉందన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ట్వీట్ చేశారు. బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో కచ్చతీవు దీవుల విషయం వెలుగులోకి వచ్చింది. 1974 జూన్ లో కచ్చతీవు దీవులపై పూర్తి హక్కులను శ్రీలంకకు అప్పగిస్తున్నట్లు అప్పటి తమిళనాడు సిఎం కరుణానిధికి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల్ సింగ్ సమాచారం అందించినట్లు వెల్లడైంది.
#WATCH | RTI reveals new details on Katchatheevu Islands
"Shocking & eye-opening": PM Modi tweets over the RTI reply#KatchaTheevu pic.twitter.com/7ek2mOG2u7
— DD News (@DDNewslive) March 31, 2024
PM Modi mentioned Kachchatheevu island in his speech.
•It is a 256 acre land, which was jointly administered by India and Sri Lanka until 1974.
•In 1974, Indira Gandhi gifted this island to Sri Lanka.
•Fishermen of both countries used to do fishing there.
•After 1976,…
— Facts (@BefittingFacts) August 11, 2023