Thursday, January 23, 2025

యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధాని మోడిదే

- Advertisement -
- Advertisement -
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ఘట్‌కేసర్: ప్రపంచానికి యోగా ప్రాముఖ్యతను తెలిపిన ఘనత ప్రధాని నరేంద్రమోడిదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఘట్‌కేసర్ పట్టణంలోని గురుకుల కళాశాల మైదానంలో పట్టణ అధ్యక్షుడు విప్పర్ల హనుమాన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడకలలో బుధవారం ముఖ్య అతిథిగా సంజయ్ పాల్గొని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి, ఎంపిపి ఏనుగు సుదర్శన్‌రెడ్డిలతో కలిసి యోగాసనాలు వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ యోగాను ఐక్యరాజ్య సమితి గుర్తించిందని, యోగా ఆరోగ్య ప్రదాయిని అని తెలిపారు.

ప్రజలు మందులు వాడకాన్ని తగ్గించి యోగా వ్యాయామం చేసినప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చలువాది ప్రవీన్ రావు, నాయకులు కాలేరు రామోజీ, నానావత్ బిక్కునాథ్ నాయక్, గొంగళ్ళ మహేష్, బర్ల అంజనేయులు, శ్రీరాంలు, ప్రభంజన్ గౌడ్, ఏనుగు మచ్చేందర్ రెడ్డి, కప్పగాల్ల కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News