న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కీలక మార్పునకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. పంట పొలాల్లో క్రిమినాశకాలు, ఎరువులు చల్లడంతో పాటు ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను మోసుకెళ్లేలా ‘కిసాన్ డ్రోన్ల’ను ఆయన ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి 100 కిసాన్ డ్రోన్లను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రోన్ రంగంలో భారత దేశం సత్తా పెరుగుతోందని, ప్రపంచానికి కొత్త నాయకత్వాన్ని కూడా వహించగలదని అన్నారు. మోడీ తన ప్రసంగంలో డ్రోన్ స్టార్టప్‌లో భారత దేశంలో ఓ కొత్త సంస్కృతి సిద్ధమవుతోందన్నారు. ఇప్పుడున్న 200 నుంచి వేల సంఖ్యల్లోకి అవి పెరుగుతాయని, దీంతో పెద్ద ఎత్తున ఉపాధి కూడా జనిస్తుందని అన్నారు. డ్రోన్ల రంగంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చూస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. డ్రోన్లను అనేక రకాలుగా ఉపయోగించవచ్చని అన్నారు. గ్రామాల్లో భూరికార్డులను రూపొందించే లక్షంగా ‘స్వమిత్వ యోజన’లో కూడా డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ‘కిసాన్ డ్రోన్లు’ కొత్త విప్లవాన్ని ఆరంభించనున్నాయన్నారు. తర్వాత ప్రధాని మోడీ దీనికి సంబంధించిన ట్వీట్ కూడా చేశారు.
100 కిసాన్ డ్రోనను ప్రారంభించిన ప్రధాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -