ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వాన్ని తాలబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిపై చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటుగా సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, అఫ్ఘానిస్థాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ పాల్గొన్నారు. అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి భారత దౌత్య సిబ్బందిని కేంద్రం అత్యవసరంగా మన దేశానికి రప్పించిన విషయం తెలిసిందే. రుద్రేంద్ర టాండన్ కూడా మంగళవారం కాబూల్‌నుంచి ఢిల్లీ వచ్చి ప్రధాని మోడీ నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.