Monday, December 23, 2024

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi participating in the Guru Ravidas Jayanti celebrations

న్యూఢిల్లీ : సిక్కు మతస్తుల ఆరాధ్య గురువు గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో గల శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయంలో భ‌క్తుల‌తో కలిసి ‘షాబాద్ కీర్తన’లో పాల్గొన్నారు. చిడతలు వాయిస్తూ భజనలో పాల్గొన్నారు. సంత్ రవిదాస్ 15–16వ శతాబ్దంలో భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన బోధించిన శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్‌లో చేర్చారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు.. అంటే మాఘ పూర్ణిమ నాడు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News