- Advertisement -
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు కేబినేట్ సమావేశం జరగనుంది. అది ముగిసిన తర్వాత ఆయన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేయ నున్నారు. రాష్ట్రపతి ఆమోదిస్తే పాత ప్రభుత్వం రద్దవుతుంది. ఆ తర్వాత సాయంత్రం జరిగే ఎన్ డిఎ పక్షాల సమావేశంలో తిరిగి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ డిఎ కూటమికి 293 స్థానాలు రాగా ఇండియా కూటమికి 199 స్థానాలు వచ్చాయి. ఇతరులు 51 స్థానాలలో గెలిచిరారు.
- Advertisement -