Thursday, December 19, 2024

మిథున్ చక్రవర్తికి ప్రధాని చీవాట్లు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. ఛాతీలో నొప్పి కారణంగా మూడు రోజుల క్రితం ఆయన కోల్ కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మిథున్ సోమవారం ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు.

తాను పూర్తిగా కోలుకున్నాననీ, త్వరలోనే సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడారనీ, తన ఆరోగ్యం గురించి వాకబు చేశారనీ మిథున్ చెప్పారు. ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోనందుకు తనను ప్రధాని మందలించారని చెప్పారు. మిథున్ కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News