రంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో ముచ్చింత్ కు చేరుకోనున్నారు. అక్కడ 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. సమతామూర్తి స్ఫూర్తికేంద్రంలో ఆయన 3గంటల పాటు ఉండనున్నారు. సమతామూర్తి కేంద్రం విశిష్టతను చినజీయర్ స్వామి ప్రధాని మోడీకి వివరించనున్నారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలను ఏరియల్ సర్వే ద్వారా మోడీ పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేనేష్టి యాగంలో నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. రాత్రి 7 గంటలకు రామానుజచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇప్పటికే శ్రీమనగరానికి పలువురు ప్రముఖులు చేరుకున్నారు. శనివారం ప్రధాని హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. శంషాభాద్ కు చేరుకున్న ప్రధానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిజిపి, సిఎస్ స్వాగతం పలికారు. అనంతరం ఇక్రిశాట్ కు చేరుకున్న ప్రధాని ఇక్రిశాట్ కొత్తలోగో, స్టాంప్ ను ఆవిష్కరించి ప్రసంగించారు.
కాసేపట్లో ముచ్చింతల్ కు ప్రధాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -