Monday, December 23, 2024

అవినీతి రహిత పాలన ప్రధాని మోడీ ఘనత

- Advertisement -
- Advertisement -

వనపర్తి : గత తొమ్మిదేళ్లుగా అవినీతి రహితంగా పాలన అందించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. మే 30 నుంచి జూన్ 30 వరకు జరుగుతున్న మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆదివారం లక్ష్మి కృష్ణ గార్డెన్స్‌లో వనపర్తి అసెంబ్లీ సంయుక్త మోర్చాల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో ఒక్క కేబినేట్ మంత్రిపై కూడా చిన్న అవినీతి మరకలేదని అవినీతి రహిత పాలన అందించడం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఘనత అని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడి తొమ్మిదేళ్ల సేవ, సుపరిపాలన పేదల సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికై మే 30 నుంచి జూన్ 30 వరకు నిర్వహిస్తున్న మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా 13 ప్రో గ్రాంలలో సంయుక్త మోర్చాల సమావేశం చాలా కీలకమైందని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏబివిపి యువమోర్చాలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ యువమోర్చా జాతీయ అధ్యక్షులుగా, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఓబిసి మోర్చా నాయకుడిగా పనిచేశారని కేంద్ర ప్రభుత్వంలోనూ పార్టీ జాతీయ బాధ్యతలలోనూ మార్చాల నాయకులకు అగ్రస్థానం దక్కుతుందని వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి జాతీయ ఓబిసి కమిషన్‌కు రాజ్యాంగ బద్ధమైన హోదా కల్పించి కమిషన్‌కు విస్తృత అధికారాలు కల్పించారని, ఏడు కేటగిరిలలో పెన్షన్ సదుపాయం కలిగిన దివ్యాంగులకు ఇరవై ఒక్క కేటగిరిలకు పెంచారని కేవలం 74 ఎయిర్‌పోర్టులకు మాత్రమే దేశంలో అందుబాటులో ఉండేవని, గడిచిని తొమ్మిదేళ్లలో మరో 74 నూతన ఎయిర్ పోర్టులను నిర్మించి జాతికి అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఇంచార్జి బోసుపల్లి ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బి. కృష్ణ, సబిరెడ్డి వెంకట రెడ్డి, పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ జింకల కృష్ణయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి బి. శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నారాయణ, పార్లమెంట్ ముస్తారక్ బుడ్డన్న, మోర్చాల అధ్యక్షులు కుమార్, కల్పన, గోపి నాయక్, రాఘవేందర్ గౌడ్, అనుఙ్ఞ రెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News