Monday, December 23, 2024

ప్రధాని మోడీ రెండు నాల్కల ధోరణి బయటపడింది: ఎంపీ వెంకటేష్‌నేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ప్రధాని మోడీ తెలంగాణాపై మరో సారి రెండు నాలుకల ధోరణి బయట పడిందని సీఎం కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత మండిపడ్డారు. శనివారం బిఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలిసి మాట్లాడుతూ అన్ని అబద్ధాలు,అసత్యాలు ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి ఇలా మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. సీఎం కెసిఆర్ నిరంతర కృషితో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందని, ఆర్ధికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసారి ఆదాయం 87 శాతం ఎక్కువ ఉందని విషయం మర్చిపోవద్దని సూచించారు.

రాష్ట్ర పుట్టుక పై విషం చిమ్మిన వ్యక్తి ప్రధానమంత్రి అడుగు అడుగునా రాష్ట్రం పై వివక్ష ఎన్ని అవమానాలు,అవహేళన చేసినా సీఎం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నదీ జలాల పై వివాదాన్ని కేంద్రం ఇంకా తేల్చడం లేదని, కాళేశ్వరంకు జాతీయ హోదా కోసం వేడుకున్నా స్పందించలేదని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ప్రాజెక్టును గుజరాత్ కు తరలించి తెలంగాణకు రూ. 520 కోట్ల ప్రాజెక్టు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించి మోసం చేశారని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఆదానికి 8 ఎయిర్ పోర్టులను ప్రధాని మోడీ అక్రమంగా కట్టబెట్టింది నిజం కాదా దేశాన్ని నియంతలా పాలించాలన్నదే మోడీ లక్ష్యమని, బీజేపీ ద్రోహులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్లు నిధులు ఇచ్చారని ప్రభుత్వ చీఫ్ విప్ టి .భానుప్రసాద్ ప్రశ్నించారు. తెలంగాణలో కుటుంబ పాలన గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని, తమ పార్టీలో ఎంతమంది వారసులు ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. పార్లమెంట్ లో సహచర మంత్రి తెలంగాణలో అవినీతి జరగలేదని సమాధానం చెప్పడం మోడీ కి తెలియదని నిలదీశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని, నాటి నుంచి నేటి వరకు కోచ్ ఫ్యాక్టరీ విషయంలో నిర్ణయం తీసుకోలేదన్నారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ గురించి ఎందుకు మాట్లాడే దమ్ము లేదు బిజెపి నేతలకు లేదన్నారు. అవినీతి ప్రభుత్వంగా మారడంతో కర్నాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News