Monday, December 23, 2024

నేడు రాష్ట్రానికి మోడీ

- Advertisement -
- Advertisement -

రూ.15,718 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన
పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో కేంద్ర పథకాలు ప్రజలకు వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆదివారం ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు సంబంధించి వివరాలను రాష్ట్ర బిజెపి విడుదల చేసింది. సోమవారం ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు ఆదిలాబాద్‌లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 11.15 గంటల నుండి 12 గంటల వరకు భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం తమిళనాడుకు వెళ్లి తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుని రాజ్ భవన్ లో బస చేస్తారు.

మంగళవారం 5 వ తేదీన సంగారెడ్డిలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలు దేరి 10.45 నుండి 11.15 గంటల వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం 11.30 గంటల నుండి 12.15 వరకు బిజెపి నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణ పర్యటన ముగిసిన తరువాత ఒడిషాకు మోడీ వెళ్లనున్నారు.

రెండు పర్యటనలో ప్రధాని మోడీ రూ. 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నారని, అందులో ఆదిలాబాద్‌లో రూ. 6,697 కోట్లు, సంగారెడ్డిలో రూ. 9,021 కోట్లు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. బేగంపేట లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. లింగంపల్లి నుండి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైల్‌ను కూడా ప్రధాని మంగళవారం ప్రారంభిస్తారు. వీటితో పాటు ఎన్టీపీసీని ప్రారంభిస్తారని బిజెపి నేతలు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల శంఖరావం తెలంగాణ నుంచే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నట్లు, ఈసారి జరిగే ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News