Friday, November 22, 2024

ప్రధాని మోడీ అమెరికా పర్యటన

- Advertisement -
- Advertisement -
Prime Minister Modi's visit to America
24న ‘క్వాడ్’ సదస్సుకు హాజరు
25న ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగం

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి 76వ సాధారణసభ(యుఎన్‌జిఎ) సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తోపాటు 100కుపైగా దేశాల అధినేతలు ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించారు. ఈ నెల 25న ఉదయం నిర్వహించే సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ఓరోజు ముందు బైడెన్ ఆతిథ్యంలో వాషింగ్టన్‌లో జరిగే క్వాడ్ దేశాధినేతల భేటీలో ప్రధాని పాల్గొంటారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మోరీసన్, జపాన్ ప్రధాని యోషిహిడేసుగా కూడా పాల్గొంటారు. క్వాడ్‌లో ఈ నాలుగు దేశాలకు సభ్యత్వం ఉన్నది. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంశాలపై క్వాడ్ దేశాధినేతలు చర్చించనున్నారని అధికారికవర్గాలు తెలిపాయి. ఇండోపసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నావిగేషన్‌పైనా క్వాడ్ అధినేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం చైనా వేస్తున్న ఎత్తుల్ని చిత్తుచేసే దిశగా క్వాడ్ దేశాల మధ్య వ్యూహాత్మక ప్రాంతీయ భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి.

ప్రాథమిక జాబితా ప్రకారం యుఎన్‌జిఎలో 109 దేశాల అధినేతల ప్రసంగాలుంటాయి. వీరిలో 60మంది అధినేతలవి ముందస్తుగా రికార్డు చేసినవని అధికారిక వర్గాలు తెలిపాయి.‘కొవిడ్19 నుంచి కోలుకోగలమన్న భరోసా ఇవ్వడం, సుస్థిరత పునరుద్ధరణ, భూగోళం అవసరాలకు స్పందించడం, మానవ హక్కుల పట్ల గౌరవం, ఐరాస పునరుజ్జీవం’ ఈ ఏడాది యుఎన్‌జిఎ అజెండాగా భారత విదేశాంగశాఖ పేర్కొన్నది. ప్రస్తుతం ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉన్నది. యుఎన్‌జిఎలో సంప్రదాయికంగా బ్రెజిల్ తర్వాత అమెరికా అధ్యక్షుడి ప్రసంగం ఉంటుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. 21న బైడెన్ ప్రసంగిస్తారు. ఐరాసలో అఫ్ఘానిస్థాన్ రాయబారి గులామ్ ఐజాక్‌జాయ్ ప్రసంగం చివరన ఉండనున్నది. గులామ్‌ను రాయబారిగా గత ప్రభుత్వం(అష్రఫ్‌ఘనీ) నియమించింది. తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ నియామకాన్ని సవాల్ చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News