Wednesday, January 22, 2025

నేడు రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన

- Advertisement -
- Advertisement -

ఎల్బీస్టేడియంలో నిర్వహించే బిసి ఆత్మగౌరవ సభకు హాజరు

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల పోరు ఊపందుకోవడంతో కమలం పార్టీ అగ్రనేతలు ప్రచారానికి నడుం బిగించారు. అందులో భాగంగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్నారు. ఎల్బీ స్టేడియంలో ఆ పార్టీ నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అందుకోసం రాష్ట్ర పార్టీ నాయకులు వారం రోజుల నుంచి ఏర్పాట్లు పూర్తి చేశారు.

మంగళవారం ప్రధాని దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.05 గంటలకు బేగం పేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభలో పాల్గొని బిసిలకు పలు హామీలు ప్రకటిస్తారు. సభ ముగించుకుని సాయంత్రం 6.35 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగి దిల్లీ పయనం కానున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ సీనియర్లు ఉమ్మడి 10 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బిసి సంఘాలతో పాటు, కార్యకర్తలు తరలివచ్చేలా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లక్ష మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News