Thursday, January 16, 2025

ప్రధానిపై ‘తేలు’ వ్యాఖ్య…. థరూర్‌పై పరువునష్టం దావాపై స్టే పొడిగింపు

- Advertisement -
- Advertisement -

నాలుగు వారాలు పొడిగించిన సుప్రీం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ లక్షంగా ‘శివలింగంపై తేలు’ అని చేసిన వ్యాఖ్యకు గాను దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌పై దిగువ కోర్టు విచారణపై స్టేను నాలుగు వారాల పాటు సుప్రీం కోర్టు సోమవారం పొడిగించింది. థరూర్ పిటిషన్‌కు తమ సమాధానాల దాఖలుకు ఢిల్లీ పోలీసులకు, ఫిర్యాదీకి న్యాయమూర్తులు హృషీకేశ్ రాయ్, ఎస్‌విఎన్ భట్లితో కూడిన ధర్మాసనం నాలుగు వారాల సమయం మంజూరు చేసింది.

‘(పరువునష్టం దావా విచారణపై స్టే) మధ్యంత ఉత్తర్వు కొనసాగుతుంది’ అని బెంచ్ ఆదేశించింది. ఫిర్యాదీ బిజెపి నేత రాజీవ్ బబ్బర్ బాధిత కక్షిదారా కాదా అన్నది ప్రాథమిక ప్రశ్న అని ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ రాజ్‌కుమార్ భాస్కర్ తకారె అన్నారు. తకారె, బబ్బర్ న్యాయవాది పిటిషన్‌కు తమ సమాధానాల దాఖలుకు సమయం కోరారు.

ఈ కేసులో దిగువ కోర్టు ముందు పరువునష్టం దావా విచారణపై సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 10న స్టే ఇచ్చింది. తనపై పరువునష్టం దావాను కొట్టివేయడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 29న జారీ చేసిన ఉత్తర్వుపై థరూర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సెప్టెంబర్ 10న దిగువ కోర్టు ముందు హాజరు కావాలని థరూర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదీ గానీ, రాజకీయ పార్టీ సభ్యులు గానీ బాధిత కక్షిదారులు కాజాలరని థరూర్ న్యాయవాది అంతకు ముందు వాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News