గోరఖ్‌పూర్(యుపి): తమ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకునే గత ప్రభుత్వాలు కేంద్ర వార్షిక బడ్జెలను రూపొందించాయని, శుష్క వాగ్దానాల వేదికగా బడ్జెట్‌లను అవి వాడుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. దేశంలో దశాబ్దాల తరబడి వాగ్దానాలకే బడ్జెట్‌లు పరిమితమయ్యాయని, అప్పటి ప్రభుత్వాలు బడ్జెట్‌లో చేసిన ప్రకటనలను ఎన్నడూ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. బ్రిటిష్ పాలకులపై సహాయ నిరాకరణ ఉద్యమానికి మహాత్మాగాంధీ పిలుపునివ్వడానికి దారితీసిన చౌరీ చౌరా హింసాత్మక ఘటనల శతాబ్ది స్మారక ఉత్సవాలను ప్రధాని మోడీ గురువారం నాడిక్కడ ప్రారంభించారు. చౌరీ చౌరా ఘటనలను ప్రధాని గుర్తు చేసుకుంటూ పోలీసు స్టేషన్‌పై దాడి చేసి 23 మంది పోలీసులను హతమార్చినందుకు 19 మంది భారతీయ పౌరులకు ఆనాడు బ్రిటిష్ పాలకులు మరణదండన విధించారని చెప్పారు. చౌరీ చౌరా అమరవీరులకు చరిత్రలో సముచిత స్థానం దక్కలేదని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగి శతాబ్దం అయిన సందర్భంగా ఒక స్మారక తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేశారు.
ఓటు బ్యాంకు దృష్టితోనే గత ప్రభుత్వాల బడ్జెట్‌లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -