Wednesday, January 22, 2025

ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్

- Advertisement -
- Advertisement -

హమాస్‌తో యుద్ధం తాజా పరిణామాలపై వివరణ

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉపయుక్తమైన చర్చలు జరిపారు. వారి మధ్య చర్చలలో ప్రాంతంలో సముద్రం ద్వారా జరిగే రాకపోకల భద్రతపై కూడా వారు తమ ఆందోళనలను పంచుకున్నారు. చర్చలు,దౌత్యపరమైన చర్యల ద్వారా బందీలందరి విడుదలతోసహా యుద్ధానికి శాంతియుత పరిష్కారం త్వరితంగా కనుగొనాలని ప్రధాని మోడీ తన చర్చలలో ఆకాంక్షించారు. బాధిత ప్రజలందరికీ మానవతా సహాయం నిరాటంకంగా కొనసాగాలని కూడా మోడీ స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ ప్రధాని నుంచి ప్రధాని మోడీకి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని కార్యాలయం(పిఎంఓ) మంగళవారంతెలిపింది. నెతన్యాహుతో జరిపిన చర్చల వివరాలను ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బాధిత ప్రజలకు మానవతా సహాయం కొనసాగుతూనే ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణ త్వరగా జరగాలన్న భారత వైఖరిని ఈ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించినట్లు ప్రధాని మోడీ తెలిపారు.

ప్రాంతంలో సముద్ర రవాణా భద్రతపై ఆందోళనలు ఏర్పడినట్లు ఆయన తెలిపారు. యెమెన్ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో ఒక వాణిజ్య ట్యాంకుపై యెమెన్‌కు చెందిన హౌతీ తీవ్రవాదులు క్షిపణితో దాడి చేయడంపై గత వారం ఆందోళనలు చెలరేగాయి. హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏర్పడిన తాజా పరిణామాలను నెతన్యాహు ప్రధాని మోడీకి వివరించినట్లు పిఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. తరచు సంప్రదింపులు కొనసాగిద్దామని ఇద్దరు నాయకులు అంగీకరించుకున్నట్లు పిఎంఓ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News