Wednesday, January 22, 2025

ధ్యాన్‌చంద్‌కు ప్రధాని నివాళులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. హాకీ దిగ్గజం, స్వర్గీయ మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం జాతీయ స్పోర్ట్ డేను ఘనంగా నిర్వహించాడు. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రధాన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన అథ్లెట్లతో సంభాషించిన వీడియో అందులో ఉంది. భారత్ కోసం క్రీడల్లో పాల్గొన్న ప్రతి అథ్లెట్‌కు అభినందనలు చెప్పేందుకు ఇంతకుమించిన తరుణం మరొకటి ఉండదని ప్రధాని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం క్రీడలకు మద్దతుగా నిలుస్తూ..యువతకు ప్రోత్సాహం ఇచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటుందన్నారు. తమకిష్టమైన క్రీడల్లో రాణించేలా క్రీడాకారులకు అండగా నిలుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా క్రీడాభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. నగరాలతో పాటు ముఖ్య పట్టణాలు, మేజర్ గ్రామాల్లో అధునాతన సౌకర్యాలతో కూడిన క్రీడా ప్రాంగణాలను నిర్మించేందుకు పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News