హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో బీజేపీ ప్రచార జోరు పెంచనుంది. ఇందులో భాగంగా రెండో దశలో వరుసగా మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 25న కరీంనగర్ సభకు, 26న నిర్మల్ సభకు మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నవంబర్ 27న హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించనున్నారు.
ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైనందున, గెలుపే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. మోడీ సభలకు ప్రజలను సమీకరించనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనే నినాదంతో ఎమ్మార్పీఎస్ విశ్వరూప సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలంటూ సమగ్ర న్యాయం, దండోరా, చలో హైదరాబాద్. ఈ సమావేశంలో ఎస్ వర్గీకరణపై ప్రధాని కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.